Essay On Child Labour In Telugu

బాల కార్మికులు అనే పదం రోజువారీ మరియు నిరంతర శ్రామికులుగా పనిచేసే బాలలను సూచిస్తుంది. బాల కార్మికతను అనేక అంతర్జాతీయ సంస్థలు దోపిడీ వ్యవస్థగా పరిగణిస్తున్నాయి, అనేక దేశాల్లో ఇది చట్టవిరుద్ధం కూడా. చరిత్రవ్యాప్తంగా బాల కార్మికులను వివిధ రకాలుగా ఉపయోగించుకున్నారు. అయితే పారిశ్రామిక విప్లవం సందర్భంగా శ్రామిక పరిస్థితుల్లో మార్పులు, సార్వత్రిక విద్య ప్రవేశం, శ్రామికులు మరియు బాలల హక్కులు తెరపైకి రావడంతో ఇది ప్రజా సమస్యగా మారింది.

అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో, నిర్ణీత వయస్సులోపల ఉన్న బాలలు (ఇంటి పనులు లేదా పాఠశాల సంబంధ పనులు మినహాయించి) పని చేయడాన్ని అక్రమం లేదా దోపిడీగా పరిగణిస్తారు.[1] నిర్దిష్ట వయస్సులోపల ఉన్న బాలలను పనిలోకి తీసుకోవడానికి యజమానులకు అనుమతి లేదు. కనీస వయస్సు అనేది దేశాన్ని మరియు పనిని బట్టి మారుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ 1973లో చేసిన కనీస వయస్సు ఒప్పందాన్ని దేశాలు ఆమోదించి, 14 నుంచి 16 సంవత్సరాల మధ్య కనీస వయస్సు పరిమితిని విధించాయి. ఎటువంటి ఆంక్షలు మరియు తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఏదైనా వ్యవస్థలో పనికి వెళ్లేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని బాల కార్మిక చట్టాలు కనీస వయస్సును 16 ఏళ్లుగా నిర్ణయించాయి.

చరిత్ర[మార్చు]

పారిశ్రామిక విప్లవం సందర్భంగా, ప్రమాదకర మరియు ప్రాణాంతక పని పరిస్థితులు ఉండే ఉత్పాదక కర్మాగారాల్లో కేవలం నాలుగేళ్ల వయస్సు ఉన్న బాలలను కూడా పనిలోకి తీసుకునేవారు.[2] దీనిని ఆధారంగా చేసుకొని, సంపన్న దేశాలు ఇప్పుడు బాలలను కార్మికులుగా ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘనగా, చట్టవ్యతిరేకంగా పరిగణిస్తున్నాయి, అయితే కొన్ని పేద దేశాలు మాత్రం బాల కార్మిక వ్యవస్థను అనుమతించడం లేదా ఉపేక్షించడం చేస్తున్నాయి.

కర్మాగారాలు మరియు గనులు మరియు చిమ్నీలను శుభ్రపరిచే పనుల్లో బాలలను ఉపయోగించడం వలన విక్టోరియా శకం అపఖ్యాతి పాలైంది.[3]పారిశ్రామిక విప్లవం ప్రారంభం నుంచి బాల కార్మికులు అందులో కీలకపాత్ర పోషించారు, తరచుగా ఆర్థిక ఇబ్బందులు వారిని పనివైపు ప్రోత్సహించేవి, ఉదాహరణకు చార్లెస్ డికెన్స్ 12 ఏళ్ల వయస్సులోనే రుణగ్రస్త కారాగారంలో ఉన్న అతని కుటుంబంతోపాటు బ్లాకింగ్ కర్మాగారం (బూట్లు పాలిష్ చేసే పరిశ్రమ)లో పనిచేశాడు. పేద కుటుంబాల మనుగడలో పిల్లలు తమ వంతు పాత్ర పోషించాల్సి వచ్చేది, తరుచుగా బాలలు కుటుంబ పోషణలో భాగంగా ప్రమాదకర ఉద్యోగాల్లో తక్కువ వేతనాలకు ఎక్కువ గంటలు పనిచేసేవారు.[4]

చురుకైన పిల్లలను చిమ్నీలను శుభ్రపరిచేందుకు ఉపయోగించేవారు; చిన్న పిల్లలను యంత్రాల కింద దూది పోగులను సేకరించేందుకు; పెద్దవారు వెళ్లేందుకు కుదరని బొగ్గు గనుల్లోని ఇరుకైన సొరంగ మార్గాల్లో పని చేయించేందుకు కూడా పిల్లలను ఉపయోగించుకునేవారు. చిన్న పనుల కోసం తిరిగేందుకు, రోడ్లు ఊడ్చేందుకు, బూట్లు పాలిష్ చేసేందుకు లేదా అగ్గిపెట్టలు, పూలు మరియు ఇతర తక్కువ ఖరీదైన వస్తువులను విక్రయించేందుకు కూడా పిల్లలనే ఉపయోగించేవారు.[4] కొంత మంది పిల్లలను భవన లేదా గృహ సేవకులుగా బాధ్యతాయుతమైన వృత్తుల్లో ఉమ్మేదువారులుగా తీసుకునేవారు (18వ శతాబ్దం మధ్యకాలం వరకు లండన్‌లో 120,000 మంది బాలలు గృహ సేవకులుగా ఉండేవారు). వీరి పని గంటలు బాగా ఎక్కువగా ఉండేవి: భవన నిర్మాణ కార్మికులు వేసవిలో వారానికి 64 గంటలు పనిచేసేవారు మరియు శీతాకాలంలో 52 గంటలు పనిచేసేవారు, ఇదిలా ఉంటే గృహ సేవకులు వారానికి 80 గంటలు పనిచేసేవారు.

[[దస్త్రం:Abolish child slavery.jpg IMAGE_OPTIONSTwo girls protesting child labour (by calling it child slavery) in the 1909 New York City parade.

ఎక్కువ సంఖ్యలో పిల్లలు వేశ్యలుగానూ పనిచేశారు.[5] మూడేళ్ల వయస్సు ఉన్న పిల్లలను కూడా పనిలోకి పురమాయించేవారు. బొగ్గు గనుల్లో ఐదేళ్ల వయస్సు నుంచే పని చేయడం ప్రారంభించిన పిల్లలు 25 ఏళ్లలోపే మృతి చెందేవారు. అనేక మంది పిల్లలు (మరియు వయోజనులు) రోజుకు 16 గంటలు పనిచేసేవారు. కర్మాగారాల్లో మరియు పత్తి మిల్లుల్లో పనిచేసే నిరుపేదల వసతి గృహాల్లోని బాలల యొక్క పని గంటలను 12 గంటలకు పరిమితం చేస్తూ 1802 మరియు 1819నాటి కర్మాగార చట్టాలు నియంత్రణ విధించాయి. ఈ చట్టాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి మరియు తరువాత అతివాద ఆందోళన కారణంగా, ఉదాహరణకు, 1831లో "స్వల్పకాల కమిటీల" ఆందోళన, రాయల్ కమిటీ 1833లో 11-18 ఏళ్లలోపు బాలలు రోజుకు గరిష్ఠంగా 12 గంటలు, 9-11 మధ్య వయస్కులు రోజుకు ఎనిమిది గంటలు, తొమ్మిదేళ్లలోపు వయస్సు వారిని పనిలోకి అనుమతించరాదని సిఫార్సు చేసింది. ఈ చట్టాన్ని కేవలం వస్త్ర పరిశ్రమకు మాత్రమే వర్తింపజేశారు, తరువాత మరింత ఆందోళన జరగడంతో, 1847లో వయోజనులు మరియు బాలల పని గంటలను రోజుకు 10 గంటలకు మాత్రమే పరిమితం చేస్తూ మరో చట్టం చేశారు.[5]

1900నాటికి, అమెరికా పరిశ్రమల్లో 1.7 మిలియన్ల మంది పదిహేనేళ్లలోపు వయస్సు ఉన్న బాల కార్మికులు ఉన్నారు.[6] జీతాలకు పరిశ్రమ ఉద్యోగాల్లో పనిచేస్తున్న 15 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలల సంఖ్య 1910నాటికి 2 మిలియన్లకు చేరుకుంది.[7]

ప్రస్తుత రోజు[మార్చు]

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ సాధారణంగా కనిపిస్తోంది, కర్మాగారాలు, గనులు,[8]వ్యభిచారం, త్రవ్వకాలు, వ్యవసాయం, తల్లిదండ్రుల వ్యాపారాల్లో సాయం చేయడం, చిన్న వ్యాపారాలు (ఉదాహరణకు ఆహార పదార్థాల విక్రయం) లేదా తాత్కాలిక ఉద్యోగాల్లో బాలలు పనిచేస్తున్నారు. కొంత మంది బాలలు పర్యాటకులకు గైడ్‌లుగా, దుకాణాలకు, రెస్టారెంట్లకు (వెయిటర్లుగానూ పనిచేస్తున్నారు) వ్యాపారాలను తీసుకురావడానికి ఉపయోగపడుతున్నారు. ఇతర బాల కార్మికులు బాక్సుల నిర్మాణం, బూట్లు పాలిష్ చేయడం, అంగడి ఉత్పత్తులను మోయడం లేదా శుద్ధి చేయడం వంటి దుర్భరమైన మరియు పదేపదే ఒకేపని చేయాల్సి వచ్చే ఉద్యోగాలకు పురమాయించబడుతున్నారు. బాల కార్మిక నిరోధక యంత్రాంగ అధికారులు మరియు ప్రచార మాధ్యమాల కన్నుపడకుండా చూసేందుకు కర్మాగారాలు మరియు శ్రమజీవులు పనిచేసే ప్రదేశాల కంటే, ఎక్కువ మంది బాల కార్మికులను అనధికారిక రంగంలో ఉపయోగిస్తున్నారు, "వీధుల్లో అనేక వస్తువులను విక్రయించేందుకు పురమాయించడం, వ్యవసాయ పనులకు ఉపయోగించడం లేదా రహస్యంగా గృహాల్లో పనులకు ఉపయోగించుకోవడం చేస్తున్నారు." అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ వారి చేత పనిచేయించుకుంటున్నారు; ఇందుకు వారికి చెల్లించే వేతనం కూడా నామమాత్రంగా ఉంటుంది. పేద కుంటుంబాలు ఉన్నంతవరకు, బాల కార్మికులు ఉంటూనే ఉంటారు.[9]

ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 14 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాల కార్మికులు 158 మిలియన్ల మంది ఉన్నట్లు UNICEF అంచనా వేసింది, ఈ అంచనాల్లో బాల గృహ కార్మికులను చేర్చలేదు.[10]ఐక్యరాజ్యసమితి మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థలు బాల కార్మిక వ్యవస్థను దోపిడీగా పరిగణిస్తున్నాయి,[11][12] దీనికి సంబంధించి UN ఒక ఒడంబడికను తయారు చేసింది, బాలల హక్కుల ఒప్పందంలోని 32వ అధికరణ ప్రకారం:

...ఆర్థిక దోపిడి నుంచి మరియు ప్రమాదకరమయ్యే పనులు లేదా బాలల విద్యను ప్రభావితం చేసే పనులు లేదా వారి ఆరోగ్యానికి లేదా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక లేదా సామాజికాభివృద్ధికి హాని చేసే పనుల నుంచి బాలలను కాపాడే హక్కును అన్ని ప్రభుత్వాలు ఆమోదించాలి. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ల మంది బాల కార్మికులుగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.[12]

1990వ దశకంలో సోమాలియా మినహా ప్రపంచంలోని ప్రతి దేశం మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు బాలల హక్కుల ఒప్పందం (CRC) పై సంతకం చేశాయి. యునైటెడ్ నేషన్స్ పౌండేషన్ ప్రకారం.. సోమాలియా 2002లో దీనిపై సంతకం చేసింది, దీనిపై సంతకం చేయడంలో సోమాలియా జాప్యం చేయడానికి, అక్కడ సంతకం చేసేందుకు ప్రభుత్వం లేకపోవడమే కారణం[13]. అక్రమ బాల కార్మిక వ్యవస్థను నిరోధించేందుకు CRC కఠినమైన,[ఆధారం చూపాలి] అత్యంత అవిరుద్ధ[ఆధారం చూపాలి] అంతర్జాతీయ న్యాయ భాషను అందజేసింది; అయితే ఇది బాల కార్మిక వ్యవస్థను అక్రమంగా ప్రతిపాదించలేదు.

పేద కుటుంబాలు మనుగడ కోసం బాల కార్మికులపై ఆధారపడుతున్నాయి, కొన్నిసార్లు బాల కార్మికులే వాటికి ఆదాయ వనరుగా ఉంటున్నారు. ఇది పారిశ్రామిక రంగంలోనే ఎప్పుడూ జరగడం లేదు గనుక, ఈ తరహా పని తరుచుగా మరుగునపడుతోంది. బాల కార్మికులను వ్యవసాయ ఉపాధి రంగంలో మరియు పట్టణ అనధికారిక రంగంలో; ముఖ్యంగా బాల గృహ కార్మికులుగా ఉపయోగించుకుంటున్నారు. బాలలకు ప్రయోజనాలు చేకూర్చేందుకు, బాల కార్మిక నిరోధక వ్యవస్థ వారికి స్వల్పకాల ఆదాయం మరియు దీర్ఘకాల ప్రయోజనాలను అందజేస్తూ ద్వంద్వ సవాళ్లను పరిష్కరించాల్సివుంది. కొన్ని వయోజన హక్కుల గ్రూపులు, నిర్దిష్ట వయస్సులోపల ఉన్నవారిని పని చేయకుండా అడ్డుకోవడం, బాలల ప్రయోజనాలను తగ్గించడం మరియు డబ్బు ఉన్నవారి పిచ్చిపనులకు వారిని వదిలిపెట్టడం మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని భావిస్తున్నాయి.[ఆధారం చూపాలి]

ఇటీవలి పత్రంలో, బసు మరియు వాన్ (1998)లు[14] బాల కార్మికతకు ప్రధాన కారణం వారి తల్లిదండ్రుల పేదరికం అని వాదించారు. అందువలన, బాల కార్మిక వ్యవస్థపై చట్టపరమైన నిషేధం విధించడంలో ఆచితూచి వ్యవహరించాలని సూచించారు మరియు పెద్దవారి వేతనాలు పెరిగేందుకు బాల కార్మిక వ్యవస్థపై నిషేధం విధించాల్సిన అవసరం ఉన్నప్పుడు, పేద బాలల కుటుంబ ఆదాయాలను సరిపడ స్థాయిలో పూరించగలిగినప్పుడు ఈ చర్యను పరిగణనలోకి తీసుకోవాలని వాదించారు. భారత్, బంగ్లాదేశ్ సహా, అనేక దేశాల్లో బాల కార్మికులను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. భారత్‌లో బాల కార్మికుల సంఖ్య 70 నుంచి 80 మిలియన్ల వరకు ఉంటుందని CACL అంచనా వేసింది.[15] 14 ఏళ్లలోపు బాలలను శ్రామికులను చేయరాదని సంబంధిత దేశాల చట్టాలు సూచిస్తున్నప్పటికీ, ఈ చట్టం తరచుగా ఉల్లంఘించబడుతోంది. 11 ఏళ్ల వయస్సు ఉన్న బాలలు హాన్స్, వాల్-మార్ట్ మరియు టార్గెట్ వంటి అమెరికా కంపెనీలకు చెందిన శ్రమజీవులు పనిచేసే కేంద్రాలకు వెళ్లి రోజుకు 20 గంటలపాటు పనిచేస్తున్నారు.

ఆసియాలో 61%, ఆఫ్రికాలో 32%, లాటిన్ అమెరికాలో 7%, అమెరికా, కెనడా, ఐరోపా మరియు ఆసియాలోని ఇతర సంపన్న దేశాల్లో 1% బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారు, ఈ దేశాల్లోని మొత్తం శ్రామికుల్లో 22% మంది బాలలున్నారు. లాటిన్ అమెరికాలోని మొత్తం శ్రామిక సంఖ్యలో 17% మంది బాలలు ఉన్నారు. దేశాల మధ్య, వాటిలోని ప్రాంతాలనుబట్టి బాల కార్మికుల వాటాలో చాలా తేడా ఉంటుంది.

ఇటీవలి బాల కార్మిక సంఘటనలు[మార్చు]

ప్రీమార్క్, వస్త్రాల తయారీలో బాల కార్మికులను ఉపయోగించుకుంటున్నట్లు BBC ఇటీవల బయటపెట్టింది[16]. BBC యొక్క పనోరమా (TV సిరీస్) కార్యక్రమం కోసం రూపొందించిన ఒక లఘచిత్రం £4.00 చేనేత చొక్కాను ప్రధానంగా ప్రస్తావించింది. "ఒక చేనేత చొక్కాకు కేవలం £4 మాత్రమే ఎందుకు చెల్లిస్తున్నాను? ఈ వస్తువు చేతితో తయారు చేసినట్లు కనిపిస్తుంది. ఇంత తక్కువ ధరకు దీనిని ఎవరు తయారు చేశారు?" అని వినియోగదారులు తమకుతామే ప్రశ్నించుకోవాలని ఈ కార్యక్రమం సూచించింది, అంతేకాకుండా బాలల దోపిడీ చెలామణిలో ఉన్న దేశాల్లో బాల కార్మిక పరిశ్రమ యొక్క ఆందోళనకర కోణాన్ని ఈ కార్యక్రమం బయటపెట్టింది. ఈ కార్యక్రమ ఫలితంగా, ప్రీమార్క్ సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకోవడంతోపాటు, వారి ఉత్పత్తుల సరఫరా ప్రక్రియను సమీక్షించుకుంది.

లిబేరియాలో రబ్బరు తోటలు పెంచే ఫైర్‌స్టోన్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీకి వ్యతిరేకంగా స్టాప్ ఫైర్‌స్టోన్ పేరుతో ఒక అంతర్జాతీయ ఆందోళన జరుగుతోంది. రబ్బరు తోటల పెంపకంలో పాల్గొనే పనివారు వారికి కేటాయించిన అధిక ఉత్పాదక కోటాను పూర్తి చేయాల్సివుంటుంది, కోటా పూర్తికాకుంటే వారి జీతాల్లో కోతలు ఉంటాయి, దీంతో కూలీలు వారి పిల్లలను కూడా పనిలోకి తీసుకొస్తుంటారు. ప్రస్తుత బాల కార్మికులు మరియు వారి తల్లిదండ్రుల (వీరు కూడా రబ్బరు తోటల పెంపకంలో ఒకప్పుడు బాల కార్మికులే) తరపున ఫైర్‌స్టోన్‌పై అంతర్జాతీయ కార్మిక హక్కుల నిధి (అంతర్జాతీయ కార్మిక నిధి వర్సెస్ ఫైర్‌స్టోన్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీ) నవంబరు 2005లో వ్యాజ్యం దాఖలు చేసింది. జూన్ 26, 2007న ఇండియనాపోలిస్‌లో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి, ఈ కేసును కొట్టివేసేందుకు ఫైర్‌స్టోన్ చేసిన ప్రయత్నాన్ని తోసిపుచ్చారు, బాల కార్మిక ఆరోపణలపై విచారణ జరిపేందుకు అనుమతి ఇచ్చారు.

నవంబరు 21, 2005న పోలీసులు, కార్మిక శాఖ, ప్రథమ్ NGO సాయంతో ఒక భారత NGO కార్యకర్త జున్నెద్ ఖాన్ నేతృత్వంలో భారత రాజధాని న్యూఢిల్లీ తూర్పు ప్రాంతంలో బాల కార్మికులను కాపాడేందుకు దండయాత్ర జరిగింది, దేశంలో బాల కార్మిక వ్యవస్థను నిరోధించడానికి జరిగిన అతిపెద్ద ప్రయత్నం ఇదే. సీలంపూర్‌లోని జనసమ్మర్థ మురికివాడలో నిర్వహిస్తున్న 100కుపైగా అక్రమ కుట్టుపని కేంద్రాల్లో పనిచేస్తున్న 480 మంది బాలలను ఈ ప్రయత్నంలో కాపాడారు. తరువాత కొన్ని వారాలపాటు, ప్రభుత్వం, ప్రచార మాధ్యమాలు, NGOలు 5-6 ఏళ్ల వయస్సున్న వారితోపాటు, అతిశయపరిచే సంఖ్యలో అనేక మంది యువ బాలలను బానిసత్వం నుంచి విడిపించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యం ముంగిట బాలల హక్కులకు ప్రమాదం పొంచివున్నట్లు ఈ సహాయ చర్య ప్రపంచం కళ్లు తెరిపించింది.

కట్టుపని పరిశ్రమల్లో బాల కార్మికులు పనిచేస్తున్నట్లు సండే అబ్జర్వర్ 28 అక్టోబరు 2007న వార్తలు బయటపెట్టడంతో, BBA కార్యకర్తలు రంగంలోకి దిగారు. GAP ఇంక్. ఒక ప్రకటనలో GAP కిడ్స్ బ్లౌజుల తయారీలో బాల కార్మికులు పనిచేస్తున్నట్లు అంగీకరించింది, వీటిని తమ ఉత్పాదన నుంచి తొలగిస్తున్నట్లు కూడా ప్రకటించింది.[17][18] ధనిక వర్గానికి చెందిన దుస్తుల తయారీలో బాల కార్మికులు పనిచేస్తున్నట్లు నిరూపించబడటంతోపాటు, అనేక సంబంధిత కంపెనీలు కూడా దీనిని ధృవీకరించాయి, ఒక్క SDM మాత్రం ఈ బాలలు బానిసత్వం లేదా నిర్బంధ పరిస్థితుల్లో పని చేయడం లేదని స్పష్టం చేసింది.

న్యాయవ్యవస్థ సంరక్షకుల లోపాయకారి వ్యాఖ్యలతో హతాశయులై, మనస్తాపం చెందిన BBA వ్యవస్థాపకురాలు, గ్లోబల్ మార్చి ఎగైనెస్ట్ చైల్డ్ లేబర్ ఛైర్‌పర్సన్ కైలాష్ సత్యార్థి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాత్రి 11.00 గంటల సమయంలో ఒక లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.[19] భారత్‌లో శ్రమజీవులు పనిచేసే ప్రదేశాల్లో బాల కార్మిక సమస్యపై ప్రభుత్వ చర్యలు తిరోగమన బాటలో ఉన్నప్పుడు, బాలల హక్కుల సంస్థలు ప్రతీకార చర్యలతో బెదిరింపులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రధాన న్యాయమూర్తి ఈ ఆదేశాన్ని జారీ చేశారు.[20]

పని ప్రదేశాల్లోకి బాల కార్మికుల ప్రవేశాన్ని నిరోధించడం, దీనిపై పర్యవేక్షణ మరియు దిద్దుబాటు చర్యలకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై సానుకూల వ్యూహాన్ని తయారు చేసేందుకు గ్లోబల్ మార్చి ఎగైనెస్ట్ చైల్డ్ లేబర్ మరియు BBAలు GAP ఇంక్ మరియు ఇతర వాటాదారులతో ఒకే సమయంలో చర్చలు ప్రారంభించాయి. GAP ఇంక్. సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డాన్ హెంక్లే ఒక ప్రకటనలో: "తాము ఈ సమస్య పరిష్కారం దిశగా పురోభివృద్ధి సాధిస్తున్నట్లు, ప్రస్తుతం బాలలు స్థానిక ప్రభుత్వ సంరక్షణలో ఉన్నట్లు పేర్కొన్నారు. తమ విధానం ప్రకారం, తమ ఆర్డర్లు స్వీకరించిన వ్యాపారులు బాలలకు విద్య, ఉద్యోగ శిక్షణ అందజేయాల్సి ఉంటుంది, వారికి ప్రస్తుత వేతనాలు చెల్లించడంతోపాటు, చట్టబద్ధమైన పని వయస్సు వచ్చిన వెంటనే వారికి ఉద్యోగ హామీ కల్పించాల్సి ఉంటుందని వెల్లడించారు. తమ సరఫరాదారులు ఈ విధులను పాటించేందుకు స్థానిక ప్రభుత్వం మరియు గ్లోబల్ మార్చ్‌లతో తాము కలిసి పనిచేస్తామని తెలిపారు." [21][22]

అక్టోబరు 28న, గాప్ నార్త్ అమెరికా అధ్యక్షుడు మార్కా హాన్సెన్, తాము బాల కార్మిక వ్యవస్థను నిషేధిస్తున్నామని ప్రకటించాడు. బాల కార్మిక వ్యవస్థను తాము ఏమాత్రం ఉపేక్షించమని- మరియు ఈ ఆరోపణను తమను తీవ్ర ఆందోళనకు, మనస్తాపానికి గురిచేసిందని అన్నాడు. గాప్ ఇటువంటి ప్రత్యక్ష సవాళ్లను గతంలోనూ పరిష్కరించింది, గతంలో తాము అనుసరించినవిధంగా, ఈ పరిస్థితిని సరిదిద్దడానికి ఎటువంటి మినహాయింపును ఇవ్వదలుచుకోవడం లేదని చెప్పాడు. 2006లో గాప్ ఇంక్. తన నియమావళి ఉల్లంఘనల కారణంగా 23 ప్యాక్టరీలతో వ్యాపారాలను రద్దు చేసుకున్నట్లు తెలిపాడు. విక్రేతలు నియమావళిని పాటిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా తాము 90 మంది అధికారులను నియోగించామని వెల్లడించాడు. దీనికి సంబంధించి తమకు ఏదైనా సమాచారం అందితే, ఆ వెంటనే సంబంధిత ఆర్డర్‌కు సంబంధించిన పనిని నిలిపివేయడంతోపాటు, ఆ ఉత్పత్తులను స్టోర్లలో విక్రయించకుండా అడ్డుకుంటున్నాము. బాల కార్మిక వ్యవస్థను నిరోధించేందుకు తాము తయారు చేసిన నియమావళిని తమకు ఉత్పత్తులు సరఫరా చేసే కర్మాగారాలు ఉల్లంఘించిన సంఘటనలు చాలా అరుదుగా జరుగుతున్నాయి, తమ విధానాలను పటిష్ఠపరిచేందుకు సరఫరాదారులతో తక్షణ సమావేశానికి పిలుపునిచ్చామని ప్రకటించాడు."[23]

ఆగస్టు 2008లో, అయోవా లేబర్ కమిషనర్ డేవిడ్ నీల్ పోస్ట్‌విల్లేలోనిఅగ్రిప్రాసెసర్స్ అనే ఒక కోషెర్మీట్‌ప్యాకింగ్ కంపెనీ 57 మంది మైనర్లను, వీరిలో 14 ఏళ్ల వయస్సు ఉన్న వారు కూడా ఉన్నారు, పనిలో పెట్టుకున్నట్లు, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇటీవల జరిపిన దాడుల్లో ఈ విషయం బయటపడిందని, ప్రభుత్వ చట్టం ప్రకారం 18 ఏళ్లకన్నా తక్కువ వయస్సువారిని పనిలో పెట్టుకోవడం నేరమని ప్రకటించాడు. తమ విభాగం జరిపిన దర్యాప్తులో అయోవా బాల కార్మిక చట్టాలను కంపెనీ అన్ని కోణాల్లోనూ ఉల్లంఘించినట్లు తేలిందని, విచారణ కోసం ఈ కేసును ప్రభుత్వ అటార్నీ జనరల్‌కు అప్పగిస్తున్నట్లు నీల్ వెల్లడించాడు."[24]. ఆరోపణలకు సంబంధించిన చట్టాలు తమకు అర్థం కాకపోవడం వలనే ఇలా జరిగిందని అగ్రిప్రాసెసర్ ప్రతినిధులు వాదించారు.

1997లో, భారత్‌లోని కాంచీపురం జిల్లాలో చేనేత పట్టు వస్త్రాల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న బాల కార్మికుల సంఖ్య 40,000కుపైగా ఉందని ఒక పరిశోధన వెల్లడించింది. చేనేత పరిశ్రమల యజమానులకు కొందరు బాలలు బానిసలుగా కూడా ఉన్నారని పేర్కొంది.రూరల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవెలప్‌మెంట్ ఎడ్యుకేషన్ బాల కార్మికుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. సంయుక్తంగా పనిచేస్తూ, RIDE బాల కార్మికుల సంఖ్యను 2007నాటికి 4000 కంటే తక్కువ స్థాయికి తగ్గించగలిగింది.

చాకోలేట్ తయారీలో ఉపయోగించే కోకా పౌడర్ తయారీకి కూడా తరచుగా బాల కార్మికులను ఉపయోగిస్తున్నారు. ఎకనామిక్స్ ఆఫ్ కోకాను చూడండి.

బాల కార్మికుల రక్షణ[మార్చు]

బాల కార్మికులతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తయారైన లేదా వారిచే తయారు చేయించిన ఉత్పత్తులను సహ అపరాధుల పాత్ర పోషిస్తూ ప్రజలు కొనుగోలు చేయడంపై కూడా తరచుగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, బాల కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులను బహిష్కరించడం వలన వారు వ్యవసాయం లేదా వ్యభిచారం వంటి మరింత ప్రమాదకర లేదా కఠిన వృత్తులను ఎంచుకునే ప్రమాదం ఉందని ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉదాహరణకు, UNICEF జరిపిన ఒక అధ్యయనంలో అమెరికాలో బాల కార్మిక నిరోధక చట్టం ప్రవేశపెట్టిన తరువాత 50,000 మంది బాలలు బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో ఉద్యోగాలు కోల్పోయారు, దీంతో అనేక మంది వస్త్ర ఉత్పత్తి కంటే మరింత ప్రమాదకరమైన మరియు వారు మరింత దోపిడీకి గురయ్యే, రాళ్లు కొట్టడం, వీధి దొంగలుగా మారడం మరియు వ్యభిచారంలోకి వెళ్లడం వంటి, మార్గాలను ఆశ్రయించడం జరిగింది. బాల కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులను బహిష్కరించడం వలన "బాల కార్మికులకు జరిగే మేలు కంటే వాస్తవానికి దీర్ఘకాలిక దుష్ప్రభావాలతో కూడిన సమస్యలు ఎక్కువవతాయని" ఈ అధ్యయనం సూచించింది.[9]

మిల్టన్ ఫ్రైడ్‌మ్యాన్ ప్రకారం, పారిశ్రామిక విప్లవానికి ముందు బాల కార్మికులందరూ వ్యవసాయ రంగంలో పని చేసేవారు. పారిశ్రామిక విప్లవం సందర్భంగా చాలా మంది బాలలు వ్యవసాయ పనుల నుంచి కర్మాగార పనులవైపు మళ్లారు. కాలం గడిచేకొద్ది, వారి వేతనాలు పెరిగాయి, తల్లిదండ్రులు వారి పిల్లలను పనిలోకి కాకుండా పాఠశాలలకు పంపడం ప్రారంభించారు, ఫలితంగా చట్టాల ప్రవేశానికి ముందు మరియు తరువాత కూడా బాల కార్మికుల సంఖ్య తగ్గింది.[25]

ఆస్ట్రియా పాఠశాలకు చెందిన ఒక ఆర్థికవేత్త ముర్రే రోథ్‌బార్డ్ కూడా బాల కార్మిక వ్యవస్థను సమర్థించారు, అమెరికా, బ్రిటన్ దేశాల్లోని బాల కార్మికులు పారిశ్రామిక విప్లవానికి ముందు మరియు తరువాత అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ జీవించారు, ఆ సమయంలో వారికి ఉద్యోగాలు అందుబాటులో లేకపోవడంతో, వారు స్వచ్ఛందంగా కర్మాగారాలకు వెళ్లి పనిచేసేవారని వెల్లడించాడు.[26]

అయితే, బ్రిటీష్ చరిత్రకారుడు మరియు సమాజవాది E.P. థామ్సన్ తన యొక్క ది మేకింగ్ ఆఫ్ ది ఇంగ్లీష్ వర్కింగ్ క్లాస్ రచనలో బాల గృహ శ్రామికులు మరియు విస్తృత (వేతన) కార్మిక మార్కెట్‌లో పాల్గొన్నవారి మధ్య విశేషమైన విలక్షణతను చూపించారు.[2] అంతేకాకుండా, ప్రస్తుత పోకడల గురించి అంచనా వేయడంలో పారిశ్రామిక విప్లవం యొక్క ఉపయోగకర అనుభవం చర్చనీయాంశమైంది. చిల్డ్రన్ అండ్ చైల్డ్‌హుడ్ ఇన్ వెస్ట్రన్ సొసైటీ సిన్స్ 1500 రచయిత, ఆర్థిక చరిత్రకారుడు హ్యూ కున్నింగ్హమ్ మాటల్లో చెప్పాలంటే:

"గత పందొమ్మిదో శతాబ్దంలో మరియు ఇరవైయ్యవ శతాబ్దం ప్రారంభంలో అభివృద్ధి చెందిన ప్రపంచంలో బాల కార్మికుల సంఖ్య తగ్గినట్లుగానే, మిగతా ప్రపంచంలోనూ ఈ సమస్య తగ్గుముఖం పడుతుందని 50 ఏళ్ల క్రితం భావించేవారు.ఇది జరగకపోవడంతో మరియు అభివృద్ధి చెందిన ప్రపంచంలో బాల కార్మిక వ్యవస్థ తిరిగి పెరగడం కారణంగా జాతీయ లేదా అంతర్జాతీయ ఇలా ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా బాల కార్మిక వ్యవస్థ పాత్రపై ప్రశ్నలు బయలుదేరాయి."[25]

"బాలల ఆడుకునే సమయాన్ని దోచుకునేవాడు అత్యంత హీనమైన దొంగ"! అంటూ ప్రముఖ కార్మిక నిర్వాహకుడు, వెస్ట్రన్ ఫెడరేషన్ ఆఫ్ మైనర్స్ నేత, ఇండస్ట్రీయల్ వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ నేత బిగ్ బిల్ హేవుడ్ చేసిన వ్యాఖ్యలు ప్రసిద్ధి చెందాయి [27]

హౌస్టన్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర అధ్యాపకుడు, వాషింగ్టన్ D.Cలో పనిచేస్తున్న అనధికారిక పౌరస్వేచ్ఛా సలహాదారు థామస్ డిగ్రెగోరి కాటో ఇన్‌స్టిట్యూట్ ప్రచురించిన ఒక కథనంలో.. "పని ప్రదేశాల నుంచి పాఠశాలల్లోకి బాలలను తీసుకురావడంలో సాంకేతిక మరియు ఆర్థిక మార్పులు కీలకపాత్ర పోషిస్తాయని" స్పష్టం చేశాడు. దీని ద్వారా వారు ఉత్పాదక వయోజనులుగా మారడంతోపాటు, ఎక్కువకాలం ఆరోగ్యకర జీవనం సాగించగలరన్నాడు. అయితే, బంగ్లాదేశ్ వంటి పేద దేశాల్లో, పనిచేస్తున్న బాలలు అనేక కుటుంబాల మనుగడకు అవసరం, 19వ శతాబ్దం వరకు కుటుంబాలకు ఉన్న ఒకేఒక్క వారసత్వ సంపద బాలలే. అందువలన, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు జరిగే పోరాటంలో అవసరాలు తరచుగా వివిధ మార్గాలు తీసుకుంటున్నాయి -- విచారకరమేమిటంటే ఇది సాధించేందుకు అనేక రాజకీయ అడ్డంకులను అధిగమించాల్సి వస్తోంది.[28]

బాల కార్మిక నిరోధక చర్యలు[మార్చు]

బాల కార్మిక వ్యవస్థ క్రమ నిర్మూలన లక్ష్యంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ (IPEC) కార్యక్రమం 1992లో సృష్టించబడింది, దేశాల సామర్థ్యాన్ని పటిష్ఠపరచడం మరియు బాల కార్మిక వ్యవస్థ నిరోధానికి ప్రపంచవ్యాప్త ఉద్యమాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని ఈ కార్యక్రమ లక్ష్యంగా పెట్టుకున్నారు. IPEC ప్రస్తుతం 88 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది, 2008లో సాంకేతిక సహకార ప్రాజెక్టులపై దీని యొక్క వార్షిక వ్యయం US$61 మిలియన్లకు చేరుకుంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్న అతిపెద్ద మరియు ILO నిర్వహిస్తున్న భారీ కార్యక్రమం ఇదొక్కటే.

ఏళ్లు గడిచేకొద్ది IPEC యొక్క భాగస్వాముల సంఖ్య మరియు పరిధి విస్తరించబడింది, ఇప్పుడు ఉద్యోగ మరియు కార్మిక సంస్థలు, ఇతర అంతర్జాతీయ మరియు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ వ్యాపార సంస్థలు, సామాజిక సంస్థలు, NGOలు, ప్రచార మాధ్యమాలు, చట్టసభలు, న్యాయవ్యవస్థల సభ్యులు, విశ్వవిద్యాలయాలు, మత సంస్థలు మరియు బాలలు, వారి కుటుంబాలు కూడా ఇందులో చేరుతున్నాయి.

ILO అజెండాలో IPEC ద్వారా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రధానాంశం. బాల కార్మిక వ్యవస్థ వలన బాలల మెరుగైన భవిష్యత్ కోసం అవసరమైన నైపుణ్యాలు మరియు విద్యలను వారికి చేరకపోవడమే కాకుండా పేదరికం కొనసాగేందుకు కారణమవడం మరియు పోటీతత్వం, ఉత్పాదకత మరియు ఆదాయ సంభావ్యతలను తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక సూచీలను ఇది ప్రభావితం చేస్తుంది. కార్మికులుగా ఉన్న బాలలకు విద్యను అందించడం మరియు వారి కుటుంబాలకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలతో సాయం చేయడం ద్వారా వయోజనులకు ప్రత్యక్షంగా మంచి పని వాతావరణాన్ని సృష్టించవచ్చు.[29]

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిబంధనలు[మార్చు]

14 సంవత్సరాలలోపు పిల్లలతో ఏ విధమైన పని చేయించకూడదు. ఫ్యాక్టరీలు, యంత్రాల మధ్య, ఎతైన ప్రదేశాలు, భూగర్భ ప్రదేశాలు వంటిచోట్ల పనిలో ఉంచితే రూ.20,000 అపరాధ రుసుం, కనీస వేతన చట్టం అమలు, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారు. కిరాణా దుకాణాల్లో, హోటల్లో, మెకానిక్‌ పనుల్లో చేర్పిస్తే సంబంధిత యజమానులపై అపరాధ రుసుం విధించి కేసులు నమోదు చేస్తారు. యజమానుల ద్వారానే పిల్లలను బడిలో చేర్పిస్తారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

అంతర్జాతీయ ఒప్పందాలు మరియు ఇతర సాధనాలు:

 • సుదూర ప్రాంతాల్లోని సురక్షిత నీటి వనరుల నుంచి గృహాలకు నీరు సరఫరా చేసే పైలెట్ ప్రాజెక్టు|సుదూర సురక్షిత జల వనరుల నుంచి గృహాలకు నీరు సరఫరా చేసే పైలెట్ ప్రాజెక్ట్
 • ILO కన్వెన్షన్ 182-వరస్ట్ ఫామ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ కన్వెన్షన్, 1999|ILO కన్వెన్షన్ 182- బాల కార్మికత అధ్వాన్న రూపాలు, 1999
 • ILO సదస్సు 138-కనీస వయస్సు, 1973|ILO కన్వెన్షన్ 138- కనీస వయస్సు, 1973

గమనికలు[మార్చు]

 1. "Ratification of the Convention on the Rights of the Child". Office of the United Nations High Commissioner for Human Rights. Retrieved 2006-10-05. 
 2. 2.02.1ఈ.పి. థామ్సన్, ది మేకింగ్ ఆఫ్ ది ఇంగ్లీష్ వర్కింగ్ క్లాస్ , (పెంగ్విన్, 1968), పేజీలు. 366-7 ఉదహరింపు పొరపాటు: Invalid tag; name "Thompson" defined multiple times with different content
 3. ↑లారా డెల్ కల్, వెస్ట్ వర్జీనియా యూనివర్శిటీ, ది లైఫ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ వర్కర్ ఇన్ నైంటీంత్- సెంచరీ ఇంగ్లండ్
 4. 4.04.1బార్బరా డేనియల్స్, పావర్టీ అండ్ ఫామిలీస్ ఇన్ ది విక్టోరియన్ ఎరా
 5. 5.05.1లేబర్ డేవిడ్ కాడీ, హార్ట్‌విచ్ కాలేజ్
 6. ↑"ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్". ది వెబ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టీచర్స్.
 7. ↑"ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ లెవీస్ హిన్: డాక్యుమెంటేషన్ ఆఫ్ లేబర్". U.S. నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్.
 8. "Child labour in Kyrgyz coal mines". BBC News. Retrieved 2007-08-25. 
 9. 9.09.1"The State of the World's Children 1997". UNICEF. Retrieved 2007-04-15. ఉదహరింపు పొరపాటు: Invalid tag; name "unicef" defined multiple times with different content
 10. ↑ధృవపరుచు హక్కులు, UNICEF
 11. "Worst Forms of Child labor Recommendation, 1999". International labor Organization. Retrieved 2006-10-05. 
 12. 12.012.1"Convention on the Rights of the Child". United Nations. Retrieved 2006-10-05. 
 13. ↑http://www.unwire.org/unwire/20020510/26300_story.asp
 14. ↑బసు, కౌషిక్ మరియు వాన్, ఫాన్ హోయంగ్, 1998. 'ది ఎకనామిక్స్ ఆఫ్ చైల్డ్ లేబర్', అమెరికన్ ఎకనామిక్ రివ్యూ, 88(3),412-427
 15. ↑సాబా సయీద్ రచించిన చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా
 16. ↑http://news.bbc.co.uk/1/hi/magazine/7468927.stm
 17. ↑http://www.globalmarch.org/gap/the_GAP_story.php
 18. ↑http://www.globalmarch.org/gap/index.php
 19. ↑http://www.globalmarch.org/gap/appeal_letter_KS.php
 20. ↑http://www.globalmarch.org/gap/High_Court_order.php
 21. ↑http://www.globalmarch.org/gap/letter_to_VP_GAP.php
 22. ↑http://www.globalmarch.org/gap/gap_statement.php
 23. ↑గాప్ ఇంక్. - మీడియా - పత్రికా ప్రకటనలు
 24. ↑http://www.nytimes.com/2008/08/06/us/06meat.html?hp మాంసం సంబంధిత పరిశ్రమలో బాల కార్మికులను గుర్తించిన దర్యాప్తు
 25. 25.025.1హక్ కున్నింగమ్, "ది ఎంప్లాయ్‌మెంట్ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఇంగ్లండ్ సి.1680-1851."పాస్ట్ అండ్ ప్రజెంట్ . ఫిబ్రవరి., 1990 ఉదహరింపు పొరపాటు: Invalid tag; name "cunningham" defined multiple times with different content
 26. ↑ముర్రే రోత్‌బార్డ్, డాన్ విత్ ప్రిమిటివిజమ్: ఎ థరో క్రిటిక్ ఆఫ్ పోలాన్‌యిలుడ్‌విగ్ వాన్ మిసెస్ ఇన్‌స్టిట్యూట్, పునఃముద్రణ జూన్ 1961 కథనం.]
 27. ↑ప్రపంచ పారిశ్రామిక కార్మికులు! ఎ గ్రాఫిక్ హిస్టరీ ఆఫ్ ది ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్, పాల్ బుహ్లే మరియు నికోలే స్కౌల్‌మన్ కూర్పు p.294.
 28. ↑డిగ్రెగోరి, థామస్ ఆర్., "చైల్డ్ లేబర్ ఆర్ చైల్డ్ ప్రాస్టిట్యూషన్?" కాటో ఇన్‌స్టిట్యూట్.
 29. ↑http://www.ilo.org/ipec/programme/lang--en/index.htm

మరింత చదవడానికి[మార్చు]

బాల కార్మికులపై ఎంపిక చేయబడిన విద్యా కథనాలు[మార్చు]

 • జీన్- మేరీ బలాండ్ మరియు జేమ్స్ ఎ. రాబిన్‌సన్ (2000) 'ఈజ్ చైల్డ్ లేబర్ ఇన్‌ఎఫిషియంట్?' జర్నల్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ' 108, 663-679
 • కౌషిక్ బసు మరియు హోమా జార్గేమీ (2009) 'ఈజ్ ప్రోడక్ట్ బాయ్‌కాట్ ఎ గుడ్ ఐడియా ఫర్ కంట్రోలింగ్ చైల్డ్ లేబర్? ఒక సిద్ధాంతపరమైన పరిశోధన' జర్నల్ ఆఫ్ డెవెలప్‌మెంట్ ఎకనామిక్స్ 88, 217-220
 • ఆగేంద్ర భుకుత్ (2008) 'డిఫైనింగ్ చైల్డ్ లేబర్: ఎ కాంట్రవర్సియల్ డిబేట్' డెవెలప్‌మెంట్ ఇన్ ప్రాక్టీస్" 18, 385-394
 • మార్టిన్ రావేలియన్ మరియు క్వెంటిన్ వుడోన్ (2000) 'డజ్ చైల్డ్ లేబర్ డిస్‌ప్లేస్ స్కూలింగ్? ఎవిడెన్స్ ఆన్ బిహేవియరల్ రెస్పాన్సెస్ టు ఎన్ ఎన్‌రోల్మెంట్ సబ్సిడీ' ఎకనామిక్ జర్నల్" 110, C158-C175

బాహ్య లింకులు[మార్చు]

వజ్ర పరిశ్రమలో బాల కార్మికులు[మార్చు]

బాల కార్మిక వ్యవస్థపై రూపొందిన తొలి సాధారణ చట్టాలు, కర్మాగార చట్టాలు, వీటిని బ్రిటన్ 19వ శతాబ్దం తొలి అర్ధభాగంలో అమల్లోకి తెచ్చింది.తొమ్మిదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలలను పనిలోకి అనుమతించరాదు మరియు 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న యువకులకు పని దినాన్ని 12 గంటలకు పరిమితం చేయాలి.[0]

బాల కార్మికుడు, న్యూజెర్సీ, 1910
2006లో వియత్నాంలోని హో చి మిన్ సిటీలో చెత్త పునరుపయోగ ప్రక్రియ జరుపుతున్న ఒక యువ బాలుడు.
గాంబియాలో టైరును బాగు చేస్తున్న బాలుడు
మే 2008లో మొరాకోలోని అత్ బెన్హాడులో చేనేత పనిచేస్తున్న బాలిక.
అక్టోబరు 1940లో మైనేలోని ఒక పొలంలో పనిచేస్తున్న బాల కార్మికులు

Industrial Revolution Child Labor Essay Why Not Try Order A

Child Labor Essay

Child Labour In Accounts For The Second Highest

Business Ethics Child Labor Essays

Essay For Kids

Child Labour In The Fashion Supply Chain

Cheap Labour Essay

Best Ideas About N Labour Law Child Labour

Essay On Child Labour For Kids

Child Labour Quotes And Slogans Quotes Wishes

Essay On Child Labour In Hindi Essay On The Problem Of Child

Essay On Child Labour For Kids

Essay On Children The Child Abuse Short Essay Essay On Children

Legalizes Child Labor Amid Skyrocketing Rates Activists

Child Labour Essay In Hindi Finance Homework

Essays On Children Essay On Children Rights Gxart Essays On

Essay Child Labour In

The Modi Government Just Made Child Labour Legal Again And Has A

The Great Depression Articles From The South S Labor Abuses

Labor Day Essay Professional Resume Writing Services In

0 Thoughts to “Essay On Child Labour In Telugu

Leave a comment

L'indirizzo email non verrà pubblicato. I campi obbligatori sono contrassegnati *